News November 27, 2024
శైలజ కుటుంబానికి రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు
TG: ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన <<14706403>>విద్యార్థిని శైలజ<<>> కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.
Similar News
News November 27, 2024
త్వరలోనే డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామకం
TG: డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 1400 మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకు రాగా త్వరలోనే వీరిని కాంట్రాక్టు టీచర్లుగా నియమించనుంది. ఇప్పటికే వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇటీవల 10వేల మంది కొత్త టీచర్లను నియమించగా వీరి సర్దుబాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా SGT పోస్టుల్లో 30% డీఈడీ పూర్తి చేసిన వారికి కేటాయించడంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారు.
News November 27, 2024
అఖిల్‌కు కాబోయే మామ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య తండ్రి జుల్ఫీ రవ్‌డ్జీ గత జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా పని చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో ఉండేవారు. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలు చేసే జుల్ఫీ కుమారుడు జైన్ ప్రస్తుతం ZR Renewable Energy Pvt Ltd. ఛైర్మన్, ఎండీగా ఉన్నారు.
News November 27, 2024
న్యాయం చేయండి: 317 జీవో బాధితులు
TG: గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై కాంగ్రెస్ సర్కార్ వేసిన సబ్ కమిటీ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అసలు అందులో ఏముందో చెప్పాలంటున్నారు. అధికారంలోకి రాగానే 48 గంటల్లో 317 జీవోను రద్దు చేస్తానన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. సొంత జిల్లాలకు దూరంగా ఉంటున్న తమకు స్థానికత ఆధారంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.