News November 27, 2024

ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ

image

కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్- హెజ్బొల్లా అంగీకరించాయి. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ PM కార్యాలయం స్పష్టం చేసింది. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడినట్లు, వారిద్దరూ వివాదం ముగింపునకు ఒప్పుకున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్- లెబనాన్ కేంద్రంగా హెజ్బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు US, యూరప్ దేశాలు, UNO చేసిన కృషికి ఫలితం దక్కినట్లైంది.

Similar News

News November 27, 2024

కలియుగ దానకర్ణుడు.. వారెన్ బఫెట్ రూ.9300 కోట్ల విరాళం

image

వరల్డ్ బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 4 సంస్థలకు 1.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9300 కోట్లు) డొనేట్ చేశారు. థాంక్స్ గివింగ్‌లో భాగంగా ఆయన ఇలాంటి విరాళాలు ఇస్తుంటారు. ఇక తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్లు వారసులకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై బెర్క్‌షైర్ హాత్‌వే వాటాదార్లకు లేఖ రాశారు. అత్యంత సంపన్నుడైన బఫెట్ ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటూ, సాధారణ కార్లలో ప్రయాణిస్తారు.

News November 27, 2024

పాల ఉత్పత్తిలో భారత్ టాప్.. తొలి 5 రాష్ట్రాలివే!

image

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ నం.1గా నిలిచింది. 2022-23లో 23.58 కోట్ల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2023-24లో 23.93 కోట్ల టన్నులకు చేరింది. గడిచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 2% పెరుగుదల కనిపించగా భారత్‌లో 6% వృద్ధి ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గేదెల నుంచి ఉత్పత్తి 16% తగ్గినా దేశవాళీ ఆవుల నుంచి 44.76% పెరిగింది. దేశంలో UP, రాజస్థాన్, MP, గుజరాత్, MH అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

News November 27, 2024

BREAKING: మెగా డీఎస్సీ సిలబస్‌ విడుదల

image

AP: మెగా డీఎస్సీ సిలబస్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్‌సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచింది. DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సిలబస్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.