News November 27, 2024

త్వరలోనే డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామకం

image

TG: డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 1400 మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకు రాగా త్వరలోనే వీరిని కాంట్రాక్టు టీచర్లుగా నియమించనుంది. ఇప్పటికే వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇటీవల 10వేల మంది కొత్త టీచర్లను నియమించగా వీరి సర్దుబాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా SGT పోస్టుల్లో 30% డీఈడీ పూర్తి చేసిన వారికి కేటాయించడంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారు.

Similar News

News November 14, 2025

3 చోట్ల ముందంజలో ప్రశాంత్ కిశోర్ పార్టీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ 3 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ పార్టీ ప్రభావం చూపించదని అంచనా వేశాయి. కీలకమైన స్థానాల్లోనూ ఓట్ల వాటాను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎఫెక్ట్ మహాగఠ్‌బంధన్‌పై పడే అవకాశం ఉంది. మరోవైపు NDA కూటమి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా దూసుకెళ్తోంది.

News November 14, 2025

బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్‌లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.

News November 14, 2025

పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

image

కొందరు పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిసీజ్‌ వస్తుంటుంది. అయితే కొందరు వైద్యులు వ్యాధి నిర్ధారణ అవ్వగానే మందులు ఇస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్‌ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి మందుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. దానికంటే ముందు వాళ్లకు బిహేవియరల్‌ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.