News November 27, 2024
2025లో 8 మంది ఏపీ ఐఏఎస్‌ల రిటైర్మెంట్
ఏపీ క్యాడర్‌కు చెందిన 8 మంది ఐఏఎస్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య రిటైర్ కానున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఎస్ నీరబ్ తాజాగా జారీ చేశారు. ఈ లిస్టులో సుమితా దావ్రా, కె.హర్షవర్ధన్(మార్చి 31), కె.విజయానంద్ (నవంబర్ 30), జి.వాణీమోహన్ (ఫిబ్రవరి 28), KRBHN చక్రవర్తి, ఎం.హరి జవహర్ లాల్, ఎస్.సత్యనారాయణ(జూన్ 30), కె.శారదా దేవి (జులై 31) ఉన్నారు.
Similar News
News November 27, 2024
మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు
రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదంది. బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని చెప్పింది. హిందూమతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు SC సర్టిఫికెట్ ఇవ్వాలని TN యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టూ తెలిపింది.
News November 27, 2024
మేం చెప్పినట్టు అదానీని అరెస్టు చేయాలి: రాహుల్ గాంధీ
అమెరికా DOJ అభియోగాలను అదానీ గ్రూప్ ఖండిస్తుందని ముందే ఊహించానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘అభియోగాలను అదానీ అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? కచ్చితంగా అలా చేయరు. అసలు పాయింట్ ఏంటంటే మేం చెప్పినట్టుగా ఆయన్ను అరెస్టు చేయడం. చిన్న చిన్న అభియోగాలకే వందలమంది అరెస్టయ్యారు. రూ.వేలకోట్ల వ్యవహారంలో ఆ జెంటిల్‌మన్ (అదానీ)పై US అభియోగాలు మోపింది. ఆయన జైల్లో ఉండాలి’ అని అన్నారు.
News November 27, 2024
BGT: రెండో టెస్టుకూ గిల్ దూరం?
చేతి వేలి గాయంతో BGT తొలి టెస్టుకు దూరమైన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టులోనూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. 10-14 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని అతడికి మెడికల్ స్పెషలిస్ట్ సూచించినట్లు BCCI వర్గాలు తెలిపాయి. రెండో టెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచులో అతను అందుకే ఆడటం లేదని పేర్కొన్నాయి. థంబ్ ఫింగర్ ఇంజూరీ నుంచి కోలుకుని ఆడేందుకు టైమ్ పడుతుందని, మూడో టెస్టులోనూ ఆడేది అనుమానమేనని పేర్కొన్నాయి.