News November 27, 2024

ఏపీలో భారీ ప్రాజెక్టులు.. భూమి కేటాయించిన ప్రభుత్వం

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ₹1,35,000కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ కోసం తొలి దశలో 2200 ఎకరాలు (ఎకరాకు ₹51.39లక్షలు) కేటాయించింది. దీనితో పాటు LG ఎలక్ట్రానిక్స్(తిరుపతి), ఫిలిప్స్ కార్బన్ బ్లాక్(నాయుడుపేట), ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్(అన్నమయ్య/కడప) కంపెనీలకు భూములు కేటాయించింది.

Similar News

News November 27, 2024

BGT: రెండో టెస్టుకూ గిల్ దూరం?

image

చేతి వేలి గాయంతో BGT తొలి టెస్టుకు దూరమైన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టులోనూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. 10-14 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని అతడికి మెడికల్ స్పెషలిస్ట్ సూచించినట్లు BCCI వర్గాలు తెలిపాయి. రెండో టెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచులో అతను అందుకే ఆడటం లేదని పేర్కొన్నాయి. థంబ్ ఫింగర్ ఇంజూరీ నుంచి కోలుకుని ఆడేందుకు టైమ్ పడుతుందని, మూడో టెస్టులోనూ ఆడేది అనుమానమేనని పేర్కొన్నాయి.

News November 27, 2024

యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరు ‘ఈగల్’గా మార్పు?

image

AP: యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’గా మార్చడంపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపిందన్నారు. ఈ భేటీలో మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

News November 27, 2024

కారు ప్రమాదంలో డైరెక్టర్ కుమారుడు మృతి

image

బాలీవుడ్ డైరెక్టర్ అశ్వినీ ధిర్ కుమారుడు జలజ్ ధిర్(18) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆయన వెళ్తున్న కారు ముంబైలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో జలజ్‌తో పాటు అతడి ఫ్రెండ్ కౌశిక్ మృతి చెందాడు. ప్రమాద సమయంలో జలజ్ మరో ఫ్రెండ్ సాహిల్ మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అశ్వినీ ధిర్ ‘సన్ ఆఫ్ సర్దార్’ సహా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.