News November 27, 2024
జెండా విషయంలో అరెస్టు

బంగ్లాలోని ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25న ఢాకాలో ‘సనాతన్ జాగరణ్ మంచా’ పేరుతో యువకులు ర్యాలీ చేశారు. అందులో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఉంచారు. తమ దేశ జెండాను అవమానపరిచారంటూ కృష్ణదాస్ సహా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీల హక్కుల కోసం పోరాడే ఓ సంస్థకు చిన్మయ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
Similar News
News January 12, 2026
అనిల్ రావిపూడి రికార్డ్.. రాజమౌళి తర్వాత

డైరెక్టర్ అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం <<18832382>>పాజిటివ్<<>> టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుడిగా నిలిచారు. ‘పటాస్(2015)’ నుంచి ఇవాళ రిలీజైన ‘MSVPG’ వరకు మొత్తం 9 సినిమాల్లోనూ హిట్ కొట్టిన దర్శకుడిగా పేరొందారు. నాగార్జునతోనూ మూవీ చేస్తే నలుగురు సీనియర్ హీరోలతో పని చేసిన యువ దర్శకుడిగా మరో ఘనత సాధిస్తారు.
News January 12, 2026
సీబీఐ విచారణకు విజయ్

కరూర్ తొక్కిసలాట కేసులో హీరో, టీవీకే చీఫ్ విజయ్ దళపతి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్లో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
News January 12, 2026
మంత్రులు, అధికారులతో CM CBN కీలక భేటీ

AP: మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన ప్రజా సేవలపై ఆయన సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్గా హాజరుకానున్నారు.


