News November 27, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం 17, అటు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాలతో 15,16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎముకలు కొరికే ఈ చలిలో ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు గజ గజలాడుతున్నారు. అటు వృద్ధులు, పిల్లలు పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది.

Similar News

News December 29, 2025

ఖమ్మం: ప్రతి యూరియా షాపు వద్ద వాలంటీర్ ఏర్పాటు: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రతి యూరియా షాపు వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రైవేట్ డీలర్ల నుంచి రైతులకు యూరియా పంపిణీకి పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. మార్క్ ఫెడ్ వద్ద మరో 8,100 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

News December 29, 2025

ఖమ్మం: గురుకులాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు ప్రవేశ పరీక్ష ప్రకటన గోడ పత్రికను ఆవిష్కరించారు. జనవరి 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బాలికల, బాలుర పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5, 6, 9వ తరగతుల్లో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

News December 29, 2025

ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. నెల రోజులకు సంబంధించి 13,642 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 9,407 మెట్రిక్ టన్నుల స్టాక్ వచ్చిందన్నారు. మరో 5,100 మెట్రిక్ టన్నుల స్టాక్ రిజర్వ్ ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.