News November 27, 2024
BREAKING: మెగా డీఎస్సీ సిలబస్ విడుదల
AP: మెగా డీఎస్సీ సిలబస్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్‌సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచింది. DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సిలబస్ కోసం ఇక్కడ <
Similar News
News November 27, 2024
అవును.. నేనో కామన్ మ్యాన్: ఏక్‌నాథ్ శిండే
తాను ప్రజా సేవకుడినని, ఎప్పుడూ సీఎంగా భావించలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే అన్నారు. ‘CM అంటే కామన్ మ్యాన్. నేనిలాగే ఫీలవుతా. మేమెప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఇంటినెలా నెట్టుకొస్తున్నారో, వారి బాధలేంటో చూశాను. అందుకే లడ్కీ బహన్ స్కీమ్ తీసుకొచ్చాను. PM మోదీ ఎంతో సాయం చేశారు. మా ఇద్దరి విజన్ ఒక్కటే. MVAలో ఆగిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను మేం పూర్తిచేశాం’ అని అన్నారు.
News November 27, 2024
మీ వాట్సాప్ స్టేటస్‌లూ ఇలా మారాయా?
వాట్సాప్‌లో రెండ్రోజులుగా కొందరు యూజర్ల స్టేటస్ ట్యాబ్ తంబ్‌నెయిల్స్ మారాయి. ఇప్పటివరకు రౌండ్ తంబ్‌నెయిల్‌పై క్లిక్ చేస్తే స్టేటస్ కన్పించేది. కొత్త UI (యూజర్ ఇంటర్‌ఫేస్)లో స్టేటస్ ఏమిటో యూజర్లందరికీ పెద్దగా కన్పిస్తుంది. ఈ డిజైన్ యూజర్లందరికీ ఇంకా అమలు చేయలేదు. ప్రస్తుతం టెస్టింగ్‌లో భాగంగా కొంత శాతం యూజర్లకు లేటెస్ట్ UI వచ్చిందని సమాచారం. కానీ ఇంతకీ మీకూ ఈ న్యూ ఫీచర్ వచ్చిందా? Do Comment☟
News November 27, 2024
అతడు మహిళలకు అసభ్యకర ఫొటోస్ పంపేవాడు: దర్శన్
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ పిటిషన్ సందర్భంగా కన్నడ నటుడు దర్శన్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. ‘రేణుకాస్వామికి మహిళలంటే గౌరవం లేదు. గౌతమ్ అనే పేరుతో పవిత్ర గౌడతో పాటు మరికొందరు మహిళలకు తరచూ న్యూడ్ ఫొటోస్ పంపి వేధించేవాడు. అతడు సమాజానికి ముప్పుగా మారాడు’ అని దర్శన్ తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.