News November 27, 2024
కలియుగ దానకర్ణుడు.. వారెన్ బఫెట్ రూ.9300 కోట్ల విరాళం
వరల్డ్ బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 4 సంస్థలకు 1.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9300 కోట్లు) డొనేట్ చేశారు. థాంక్స్ గివింగ్లో భాగంగా ఆయన ఇలాంటి విరాళాలు ఇస్తుంటారు. ఇక తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్లు వారసులకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై బెర్క్‌షైర్ హాత్వే వాటాదార్లకు లేఖ రాశారు. అత్యంత సంపన్నుడైన బఫెట్ ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటూ, సాధారణ కార్లలో ప్రయాణిస్తారు.
Similar News
News November 27, 2024
పరవాడ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పరవాడ ఫార్మా సిటీ కంపెనీలో విషవాయువులు లీకై ఒకరు మరణించారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు.
News November 27, 2024
షమీని అందుకే రిటెయిన్ చేసుకోలేకపోయాం: నెహ్రా
IPLలో తమ జట్టుకు గడచిన రెండు సీజన్లలోనే 48 వికెట్లు తీసిన షమీని గుజరాత్ టైటాన్స్ రిటెయిన్ చేసుకోలేదు. దీని వెనుక కారణాన్ని ఆ జట్టు హెడ్‌కోచ్ నెహ్రా వివరించారు. ‘షమీని రిటెయిన్ చేసుకోవాలనే అనుకున్నాం. కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది. వేలంలో ధర రూ.10 కోట్లకు చేరడంతో ఆ ధర మరీ ఎక్కువని భావించాం’ అని వెల్లడించారు. షమీని వేలంలో రూ.10 కోట్లకు SRH దక్కించుకున్న సంగతి తెలిసిందే.
News November 27, 2024
అవును.. నేనో కామన్ మ్యాన్: ఏక్నాథ్ శిండే
తాను ప్రజా సేవకుడినని, ఎప్పుడూ సీఎంగా భావించలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే అన్నారు. ‘CM అంటే కామన్ మ్యాన్. నేనిలాగే ఫీలవుతా. మేమెప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఇంటినెలా నెట్టుకొస్తున్నారో, వారి బాధలేంటో చూశాను. అందుకే లడ్కీ బహన్ స్కీమ్ తీసుకొచ్చాను. PM మోదీ ఎంతో సాయం చేశారు. మా ఇద్దరి విజన్ ఒక్కటే. MVAలో ఆగిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను మేం పూర్తిచేశాం’ అని అన్నారు.