News November 27, 2024
సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలు బ్యాన్!
ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ(102ఓట్లు అనుకూలం, 13వ్యతిరేకం)ఆమోదం లభించగా సెనెట్‌కు పంపింది. అక్కడ పాసై అమల్లోకి వస్తే టిక్‌టాక్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి. లేకపోతే 50 మిలియన్ డాలర్ల ఫైన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Similar News
News November 27, 2024
సైడైపోయిన శిండే.. మహారాష్ట్ర CM అయ్యేదెవరో?
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. PM మోదీ ఎవరిని నియమించినా ఫర్వాలేదని స్వయంగా చెప్పడంతో పోటీలో ఏక్‌నాథ్ <<14724983>>శిండే<<>> లేరన్న సంకేతాలు వచ్చాయి. అజిత్ పవార్ (NCP) ఆ సమీకరణాల్లోనే లేరు. ఇక మిగిలింది దేవేంద్ర ఫడణవీస్. అయితే ఆయనే CM. లేదంటే కొత్త ముఖాన్ని చూడటం పక్కా. హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, RJ, MP CMల ఎంపికను గమనిస్తే BJP కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయడం అర్థమవుతోంది.
News November 27, 2024
ప్రధాని మోదీని కలిసిన BJP నేతలు
TG: రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. అందరినీ ఆయన ప్రేమతో ఆప్యాయంగా పలకరించారు. అందరూ బాగున్నారా అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో నేతలు కలసి మెలసి పని చేయాలని ఆయన సూచించారు. మోదీని కలిసిన వారిలో విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజా సింగ్, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.
News November 27, 2024
మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి?: కిషన్‌రెడ్డి
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి? అంటూ ఆయన ప్రశ్నించారు. వరిధాన్యానికి బోనస్ విషయంలోనూ సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని నిబంధనలు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.