News November 27, 2024

కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది: బండి సంజయ్

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా విద్యార్థులకు పెట్టే ఆహారం మారలేదని విమర్శించారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ‘పిల్లలకు సురక్షిత భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను కూడా నిర్వర్తించలేని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుంది?’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 19, 2026

రూ.4.25 కోట్ల వడ్డీ లేని రుణాలు: ADB కలెక్టర్

image

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1049 సంఘాలకు గాను రూ.4,25,70,880 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కమిషనర్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు.

News January 19, 2026

WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

image

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News January 19, 2026

పెట్టుబడుల వేటలో సీఎంలు!

image

దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల టార్గెట్ మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్, మంత్రులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. CBN ఒకరోజు ముందే వెళ్లి పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఇవాళ రేవంత్ కూడా తన బృందంతో వెళ్లారు. గతంలో కూడా ఇద్దరూ దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. లేటెస్ట్ పర్యటనలతో ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వస్తాయనే చర్చ మొదలైంది.