News November 27, 2024
మరో ఇండో-అమెరికన్‌కు ట్రంప్ కీలక పదవి
US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టారు. Dr.జయ్ భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించారు. దీంతో అత్యున్నత పరిపాలన స్థానానికి ట్రంప్ నామినేట్ చేసిన తొలి ఇండో-అమెరికన్‌గా జయ్ నిలిచారు. కోల్‌కతాలో జన్మించిన ఆయన స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ట్రంప్ ఇటీవల వివేక్ రామస్వామిని DOGE అధిపతిగా నియమించారు.
Similar News
News November 27, 2024
RCB ఫ్యాన్స్, బెంగళూరుతో ప్రేమలో పడిపోయా: ఫాఫ్ డు ప్లెసిస్
RCBతో తన మూడేళ్ల ప్రయాణం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ ఇన్‌స్టాలో సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ జట్టుతో అద్భుతమైన ప్రయాణం ముగిసింది. RCB ఫ్యాన్స్, బెంగళూరు సిటీతో ప్రేమలో పడిపోయాను. ఈ జ్ఞాపకాలు జీవితాంతం నాతో ఉంటాయి. చిన్నస్వామి స్టేడియంలో ఆడటం నా కెరీర్లోనే అత్యంత ఉర్రూతలూగించే అనుభూతి. అందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణం నాకో గౌరవం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫాఫ్ డీసీకి ఆడనున్నారు.
News November 27, 2024
‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు
TG: సీఎం రేవంత్ కూల్చివేతల మనిషి(డెమోలిషన్ మ్యాన్) అంటూ తెలంగాణ BJP సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఆయన వెనుకబడిన, పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తాడని ఆరోపించింది. కాంగ్రెస్ ఉన్నతవర్గం, మిత్రపక్షం BRS, కామన్ ఫ్రెండ్ ఒవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌లను తాకబోరంటూ విమర్శలు గుప్పించింది. హైడ్రా, మూసీ కూల్చివేతలను ఉద్దేశించి ఈ పోస్టు చేసింది.
News November 27, 2024
వీడియో లీక్.. స్పందించిన నటి
పాయల్ కపాడియా దర్శకత్వంలో తాను నటించిన ‘ఆల్ వి ఇమేజిన్ యూజ్ లైట్’ మూవీకి సంబంధించిన తన నగ్న సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంపై మలయాళ నటి దివ్య ప్రభ స్పందించారు. ‘ఫేమ్, పాపులారిటీ కోసమే ఇలాంటి సీన్లలో నటించానని కొందరు అంటున్నారు. ఈ సినిమా కంటే ముందు నటించిన పలు చిత్రాలకు అవార్డులు అందుకున్నా. పేరు కోసం ఇలాంటి వాటిలో నటించాల్సిన అవసరం నాకు లేదు. కథలు నచ్చితే సినిమాలు చేస్తా’ అని ఆమె చెప్పారు.