News November 27, 2024

ఆదినారాయణరెడ్డి, JC తీరుపై CM ఆగ్రహం!

image

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లైయాష్ తరలింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News January 13, 2026

పులివెందుల హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

image

పులివెందుల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర సంవత్సరాల కిందట జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కడప అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఫిర్యాదిదారుడిపై కత్తితో దాడి చేసినట్టు నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News January 13, 2026

మూడవరోజు గండికోట ఉత్సవాల షెడ్యూల్ ఇదే..!

image

* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అడ్వెంచర్ యాక్టివిటీస్-హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్
* సాయంత్రం 4-7 వరకు కవిత్వం, కథ చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్, లాగింగ్, వంటల పోటీలు
* సాయంత్రం 7 గంటలకు మిమిక్రి, జానపద గేయాలు, చెక్క భజన, క్లాసికల్ డాన్స్, యక్ష గానం, బృందావనం-సౌండ్, లైట్&లేజర్ షో
* 7:20-9 వరకు శివమణి మ్యూజికల్ నైట్
* రాత్రి 9లకు ఫైర్ వర్క్స్
*9:30కి ఉత్సవాల ముగింపు

News January 12, 2026

వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

image

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.