News November 27, 2024

పరవాడ: ఫార్మా కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి

image

పరవాడ ఫార్మాసిటీలో గల ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు CITU ఆరోపించింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో CPM అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, CITU ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 9, 2025

గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

image

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News July 9, 2025

అర్ధరాత్రి అప్పన్నకు చందనం సమర్పణ

image

సింహాచలం అప్పన్న స్వామికి అర్ధరాత్రి పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో స్వామివారు పరిపూర్ణంగా నిత్య రూపంలోకి మారుతారు. 2 గంటల సమయంలో సుప్రభాత సేవ అనంతరం చందనం సమర్పిస్తారు. అనంతరం 3గంటలకు ఆరాధన, బాల భోగం, రాజ భోగం నిర్వహిస్తారు. గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.

News July 9, 2025

‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

image

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.