News November 27, 2024
కడియం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

కడియం మండలం వేమగిరి 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ బి.నాగదుర్గ ప్రసాద్ తెలిపారు. వేమగిరి గట్టుకి చెందిన కల్లా దుర్గ ఆమె మేనకోడలు పితాని రూపాదేవి స్కూటీపై డిగ్రీ పరీక్షలు రాసేందుకు రాజమండ్రి వెళ్తుండగా వేమగిరి సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి మృతిచెందగా మరో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News August 20, 2025
తూ.గో: ఓవర్‌స్పీడ్‌పై స్పెషల్ డ్రైవ్.. 298 కేసులు నమోదు

వేగంగా వాహనాలు నడిపిన వారిపై వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 298 ఓవర్‌స్పీడ్ కేసులు నమోదు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ డ్రైవ్ ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు కొనసాగిందని, ఈ-చలానాల రూపంలో రూ.3.10లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ స్పెషల్ డ్రైవ్‌ల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
News August 19, 2025
‘మత్తు’కు దూరంగా ఉండండి: ఈగల్ ఐజీ

రాజమండ్రి సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈగల్ ఐజి ఏకే రవికృష్ణ మంగళవారం మాట్లాడారు. ఎన్‌డీపీఎస్ చట్టం తీవ్రతను వారికి ఆయన వివరించారు. భవిష్యత్తులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. అనంతరం గంజాయి వాడబోమని ఖైదీలతో ప్రతిజ్ఞ చేయించారు.
News August 19, 2025
రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.