News November 27, 2024
అభివృద్ధిని ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: భట్టి
TG: మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10 వేల కోట్ల కేటాయించామని, అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కాకుల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. పనిలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదన్నారు. మూసీ నిర్వాసితులకు వ్యాపార రుణాలు ఇస్తామని చిట్‌చాట్‌లో వెల్లడించారు.
Similar News
News November 27, 2024
పుష్ప-2 మూవీ నుంచి క్రేజీ న్యూస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ సెన్సార్ పూర్తైనట్లు తెలుస్తోంది. కొన్ని బీప్స్‌తో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. సినిమాలో జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్, పుష్ప-శ్రీవల్లి మధ్య ఎమోషన్ సీన్లు అదిరిపోయాయంటూ సినీ వర్గాలు సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ సృష్టిస్తున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.
News November 27, 2024
బాబోయ్..! వరుడికి ఇవేం కండీషన్లు పెళ్లి కూతురా!!
ఓ ఇంగ్లిష్ డైలీలో పబ్లిష్ అయిన ఓ మ్యాట్రిమోని యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘స్త్రీవాద అభిప్రాయాలతో పొట్టి జుట్టు, చెవి పోగులు గల 30+ వయసు గల విద్యావంతురాలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆమెకు 25-28 మధ్య వయస్సులోని అందమైన యువకుడు కావలెను. ఏకైక సంతానమై సొంత వ్యాపారాలు, భారీ బంగ్లా లేదా 20 ఎకరాల భూమి ఉండాలి. వంట తప్పక తెలియాలి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ డిమాండ్లపై మీరేమంటారు?
News November 27, 2024
IPL వేలంలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ
IPL 2025 వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోసం టోర్నీ చరిత్రలోనే అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆయన కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 103 బిడ్లు దాఖలు చేశాయి. కేకేఆర్, డీసీ, పంజాబ్ పోటీ పడడంతో బిడ్ల సంఖ్య సెంచరీ దాటింది. కాగా మెగా వేలంలో అయ్యర్‌ను రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.