News November 27, 2024
9 నెలల్లో రూ.11,333 కోట్ల సైబర్ మోసం
ఈ ఏడాది తొలి 9నెలల్లో భారత్ రూ.11,333కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.4,636 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌తో రూ.3,216 కోట్లు, డిజిటల్ అరెస్ట్ మోసాల వల్ల రూ.1,616కోట్లు నష్టపోయినట్లు వివరించింది. 2021నుంచి మొత్తం 30.05లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు వచ్చాయంది. ఇందులో 45 శాతం మోసాలు కంబోడియా, మయన్మార్, లావోస్ కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు.
Similar News
News November 27, 2024
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు: మోదీ
TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. TG BJP నేతలతో భేటీ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు BRS దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారని, ఇప్పుడు ఎంతో ఆశతో BJP వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో BJP ఉనికి వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, BRSల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా BJP స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.
News November 27, 2024
హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో మూవీ టీమ్‌తో ఆయన షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 28న సినిమా విడుదల కానుంది. ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తుండగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.
News November 27, 2024
BREAKING: ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు
తమిళ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇటీవల వీరు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని గత వారం కోర్టు విచారణలో ఇద్దరూ చెప్పారు. దీంతో ఏకాభిప్రాయం ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చింది. రజినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకోగా, 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి ఇద్దరు కుమారులు.