News November 27, 2024

కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభం

image

విశాఖ నగరం కైలాసగిరి పై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా నెలకొల్పిన అడ్వెంచర్స్ స్పోర్ట్స్-జిప్ లైనర్, స్కై స్కైలింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి 2025 నాటికి పూర్తవుతుందన్నారు.

Similar News

News November 27, 2024

విశాఖ: రైల్వేస్ జట్టుపై గెలుపొందిన చత్తీస్‌గఢ్

image

సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ ట్రోఫీలో భాగంగా విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో రైల్వేస్ జట్టుపై చతీస్‌గఢ్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన రైల్వేస్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చతీస్‌గఢ్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.

News November 27, 2024

పరవాడ ఘటనపై దర్యాప్తునకు అనకాపల్లి కలెక్టర్ ఆదేశం

image

పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం రాత్రి లిక్విడ్ లీకేజ్ వల్ల 9 మంది కార్మికులు శ్వాస, దగ్గుతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. వీరిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఒడిశాకు చెందిన హెల్పర్ అమిత్ బుధవారం మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. ఇద్దరికి వెంటిలెటర్ చికిత్స జరుగుతుందన్నారు.

News November 27, 2024

విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకరమైన బల్లులు స్వాధీనం

image

వైజాగ్ ఎయిర్ పోర్టులో అత్యంత ప్రమాదకరమైన బల్లులను కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు మూడు, వెస్ట్రన్ బల్లులు మూడు స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి అక్రమంగా ఇండియాకు తరలిస్తుండగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు సంయుక్త తనిఖీల్లో విషయం వెలుగులోకి వచ్చింది.