News November 27, 2024
STOCK MARKETS: సూచీలకు అదానీ కిక్కు
<<14723346>>అదానీ గ్రూప్ <<>>కంపెనీల షేర్లు కిక్కివ్వడంతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80,234 (+230), నిఫ్టీ 24,274 (+80) వద్ద క్లోజయ్యాయి. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 5.21% తగ్గడం సానుకూల పరిణామం. ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, O&G సూచీలు కళకళలాడాయి. ADANIENT, ADANIPORTS, BEL, TRENT, NTPC టాప్ గెయినర్స్. అపోలో హాస్పిటల్స్, TITAN, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో టాప్ లూజర్స్.
Similar News
News November 27, 2024
చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు
TG: HYDలోని చెరువుల FTL, బఫర్‌జోన్లు నిర్ధారించే వరకు వాటిపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. HMDA పరిధిలో 3,532 చెరువులున్నాయని, 2,793 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్లు, 530 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నోటిఫికేషన్ల ఖరారుకు 3 నెలల గడువు కోరింది. కాగా గడువు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు DEC 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
News November 27, 2024
ఒక్క లాటరీ.. సెలబ్రిటీల కంటే ‘రిచ్’
ఓ బ్రిటిష్ వ్యక్తిని ఒకే ఒక లాటరీ UKలోని టాప్ సెలబ్రిటీల కంటే సంపన్నులను చేసింది. హాలీవుడ్ నటుడు హ్యారీ స్టైల్స్, హెవీ వెయిట్ బాక్సర్ ఆంథోని జోషువా(రూ.1,784కోట్ల)ను మించిన రిచెస్ట్ పర్సన్ అయ్యారు. నిన్న తీసిన యూరో మిలియన్స్ డ్రాలో ఓ లాటరీ విన్నర్ ఏకంగా రూ.1,804కోట్లు దక్కించుకున్నారు. UK చరిత్రలో ఇది మూడవ అతిపెద్ద మొత్తం. కాగా ఆ విన్నర్ ఎవరనేది తెలియలేదు. 2022లో రూ.1987.63కోట్ల లాటరీ టాప్.
News November 27, 2024
మారిటైమ్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మారిటైమ్ పాలసీపై ఆయన చర్చించారు. ‘తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు.