News November 27, 2024
HYD: ఫిబ్రవరిలో 300 మందితో బర్డ్ సర్వే
వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.
Similar News
News November 27, 2024
HYD: ప్రధాని మోదీతో కేంద్ర మంత్రులు, ఎంపీలు
రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని రాజకీయ అంశాల గురించి చర్చించినట్లు వారు తెలిపారు.
News November 27, 2024
హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు
HYDలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం <<14722224>>జీడిమెట్ల<<>>లోని కంపెనీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చల్లారకముందే <<14721016>>మణికొండ<<>>, <<14721091>>రామంతాపూర్<<>>లో రెండు సంఘటలు వెలుగుచూశాయి. 2024లో ఇప్పటివరకు HYD, MM, RRలో 1550కి పైగా ప్రమాదాలు జరగడం ఆందోళనకరం. ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News November 27, 2024
HYD: మణుగూరు స్పెషన్ ట్రైన్లో దారుణం
మణుగూరు స్పెషన్ ట్రైన్లో దారుణం జరిగింది. HYDలో ఉంటున్న కూతురుని చూసేందుకు రమణమ్మ NOV 23న బళ్లారి సమీపంలోని ఓ స్టేషన్లో రైలుఎక్కింది. 24న రైలు సికింద్రాబాద్ చేరుకుంది. స్టేషన్లో ఎదురుచూస్తున్న అల్లుడు రైలులోని బాత్రూంలో <<14716114>>అత్త మృతదేహం<<>> చూసి రైల్వే పోలీసులకు సమాచారమి చ్చాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోహిత్ అనే వ్యక్తి హత్య చేసి రూ. 25 వేల నగదు, సెల్ఫోన్ అపహరించినట్లు గుర్తించి, అరెస్ట్ చేశారు.