News November 27, 2024
అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్: కిషన్‌రెడ్డి

TG: పార్టీ ఫిరాయింపుల విషయంలో BRS, కాంగ్రెస్ ఒకటేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో అన్నారు. అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్ పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారన్నారు. ఫిరాయింపు MLAలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. అటు ఫుడ్‌పాయిజన్‌తో ఓ చిన్నారి చనిపోతే CM రేవంత్ కనీసం దృష్టి పెట్టలేదని అన్నారు. 4-5 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు.
Similar News
News January 10, 2026
TGలో చిరంజీవి మూవీ టికెట్ల ధరల పెంపు

TG: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 12న విడుదలవనుండగా.. 11న ప్రీమియర్స్‌కు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. వారంపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకరించింది. సింగిల్ స్క్రీన్‌లో GSTతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
News January 10, 2026
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
News January 10, 2026
కోటీశ్వరులు పెరిగారు!

దేశంలో కోటీశ్వరుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ సమాచారం మేరకు కోటికి పైగా ఆస్తులు ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కి పెరిగింది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఇది 8.92 కోట్లుగా ఉండేది. కోటీశ్వరుల సంఖ్యలో 21.65% వృద్ధి నమోదు కాగా, రిటర్నులు 1.22% మాత్రమే పెరగడం గమనార్హం.


