News November 27, 2024
వీడియో లీక్.. స్పందించిన నటి
పాయల్ కపాడియా దర్శకత్వంలో తాను నటించిన ‘ఆల్ వి ఇమేజిన్ యూజ్ లైట్’ మూవీకి సంబంధించిన తన నగ్న సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంపై మలయాళ నటి దివ్య ప్రభ స్పందించారు. ‘ఫేమ్, పాపులారిటీ కోసమే ఇలాంటి సీన్లలో నటించానని కొందరు అంటున్నారు. ఈ సినిమా కంటే ముందు నటించిన పలు చిత్రాలకు అవార్డులు అందుకున్నా. పేరు కోసం ఇలాంటి వాటిలో నటించాల్సిన అవసరం నాకు లేదు. కథలు నచ్చితే సినిమాలు చేస్తా’ అని ఆమె చెప్పారు.
Similar News
News November 27, 2024
ఇసుక లభ్యత పెంచండి: సీఎం చంద్రబాబు
APలో ఇసుక లభ్యత, అక్రమాల నియంత్రణపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక డిమాండ్ దృష్ట్యా లభ్యత పెంచాలని అధికారులకు సూచించారు. ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి శాండ్ కమిటీలు, అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బంది పెట్టవద్దని, ధరల కట్టడికి పున:సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా, తవ్వకం వ్యయం తక్కువ ఉండేలా చూడాలన్నారు.
News November 27, 2024
సయ్యద్ మోదీ టోర్నీలో రెండో రౌండ్‌కు సింధు, లక్ష్య సేన్
ఢిల్లీలో జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో పీవీ సింధు, లక్ష్య సేన్ రెండో రౌండ్‌కు ముందంజ వేశారు. భారత షట్లర్ అన్మోల్ ఖార్బ్‌పై 21-17, 21-15 తేడాతో సింధు, మలేషియా షట్లర్ షోలెహ్ ఐదిల్‌పై 21-12, 21-12 తేడాతో లక్ష్యసేన్ గెలిచారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న సింధు.. తర్వాతి రౌండ్‌లో మరో భారతీయురాలు ఇరా శర్మను ఎదుర్కోనున్నారు.
News November 27, 2024
గుకేశ్ ఖాతాలో 3వ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్‌లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందడం గమనార్హం. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్(18) చరిత్ర సృష్టిస్తారు.