News November 27, 2024

IPL వేలంలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ

image

IPL 2025 వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోసం టోర్నీ చరిత్రలోనే అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆయన కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 103 బిడ్లు దాఖలు చేశాయి. కేకేఆర్, డీసీ, పంజాబ్ పోటీ పడడంతో బిడ్ల సంఖ్య సెంచరీ దాటింది. కాగా మెగా వేలంలో అయ్యర్‌ను రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

Similar News

News November 28, 2024

నాకు పంజాబ్ కంటే ఆర్సీబీయే బెటర్: లివింగ్‌స్టోన్

image

IPL వేలంలో తనను ఆర్సీబీ తీసుకోవడం పట్ల ఇంగ్లండ్ ఆటగాడు లివింగ్‌స్టోన్ హర్షం వ్యక్తం చేశారు. ‘బెంగళూరు ఫ్యాన్స్ చాలా అభిమానం చూపిస్తారు. అక్కడి స్టేడియం కూడా చిన్నది. నా ఆటతీరుకు పంజాబ్ కంటే ఆర్సీబీయే కరెక్ట్‌గా ఉంటుంది. మా జట్టు వేలం చాలా బాగా జరిగింది. మంచి ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వారిలో కొంతమంది నాకు సన్నిహితులే. విరాట్‌తో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

News November 28, 2024

బాధ్యతలు చేపట్టిన స్మితా సభర్వాల్‌

image

TG: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 12న ఆమెకు ఈ పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా ఇప్పటివరకు స్మిత అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.

News November 28, 2024

280 కి.మీ వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైళ్లు

image

దేశంలో హైస్పీడ్ రైళ్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు 280 కి.మీ వేగంతో ప్రయాణించేలా BEMLతో కలిసి చెన్నై ICFలో వీటిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఒక్కో కోచ్ తయారీకి రూ.28 కోట్లు ఖర్చవుతుందని, ఇతర రైళ్ల బోగీలతో పోలిస్తే తయారీ ఖర్చు ఎక్కువన్నారు. ఆటోమేటిక్ డోర్స్, CCTV, మొబైల్ ఛార్జింగ్, ఫైర్ సేఫ్టీ సహా మరికొన్ని ఆధునాతన ఫీచర్లు ఈ రైళ్లల్లో ఉంటాయన్నారు.