News November 27, 2024

మారిటైమ్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు

image

AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మారిటైమ్ పాలసీపై ఆయన చర్చించారు. ‘తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News February 3, 2026

ఏప్రిల్ 3న శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్

image

శర్వానంద్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్‌లో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన ‘ఫస్ట్ ల్యాప్’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. జిబ్రాన్ మ్యూజిక్ ఈ రేసింగ్ థ్రిల్లర్‌కు స్పెషల్ అట్రాక్షన్.

News February 3, 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్

image

TG: జగిత్యాల(D) మొగిలిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు రైతు కూలీలు స్పాట్‌లోనే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 3, 2026

MLC ఎంపికకు మా ఆదేశాలు అడ్డంకి కాదు: SC

image

MLCల ఎంపికపై క్యాబినెట్ సిఫార్సుకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని SC స్పష్టం చేసింది. తన ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులపై అమిర్ అలీ వేసిన వెకేట్ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారించింది. MLCల ఎంపికకు తమ ఆదేశాలు అడ్డంకి కావని గతేడాది AUG 13నాటి మధ్యంతర తీర్పులో స్పష్టం చేసినట్లు పేర్కొంది. అమిర్ అలీ పిిటిషన్‌ను దాసోజు శ్రవణ్ పిటిషన్‌కు జతచేస్తూ విచారణను MAR 19కి వాయిదా వేసింది.