News November 27, 2024

గుకేశ్ ఖాతాలో 3వ విజయం

image

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్‌లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందడం గమనార్హం. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్(18) చరిత్ర సృష్టిస్తారు.

Similar News

News November 28, 2024

కొత్త సినిమా మొదలుపెట్టిన సూర్య

image

హీరో సూర్య కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య45’ పూజా కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సినిమాకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రానున్న ‘సూర్య 44’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కంగువా’ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

News November 28, 2024

ఆ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు: తలసాని

image

TG: ఇథనాల్ ఫ్యాక్టరీతో <<14729304>>తమకు ఎలాంటి సంబంధం లేదని<<>> మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉన్నత పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

News November 28, 2024

ట్రైన్లో దుప్పట్లు ఎన్ని రోజులకు ఉతుకుతారంటే?

image

రైళ్లలో ప్రయాణికులకు అందజేసే దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి ఉతుకుతున్నారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. బెడ్‌రోల్ కిట్‌లో మెత్తని కవర్‌గా ఉపయోగించేందుకు అదనపు బెడ్‌షీట్‌ను అందించినట్లు ఆయన తెలిపారు. రైల్‌మదద్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను పర్యవేక్షించడానికి రైల్వే జోనల్ హెడ్‌క్వార్టర్స్, డివిజనల్ స్థాయుల్లో ‘వార్ రూమ్‌లను’ ఏర్పాటు చేశామన్నారు.