News November 28, 2024
HYD: జంతువుల వెచ్చదనానికి ఏర్పాట్లు

సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.
Similar News
News January 2, 2026
HYD: ‘మీ సోకు మేం క్యాష్ చేస్కుంటాం’

ధరల పెంపుతో స్మోకర్స్‌కు ముందే ‘పొగ’ పెడుతున్నారు వ్యాపారులు. సిగరెట్లపై 40% పన్ను పెంచుతున్నట్లు కేంద్రం చెప్పడమే లేట్ నగరంలో నోస్టాక్ అంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్యాకెట్‌పై ₹10 సింగిల్‌గా ₹2 ఎక్స్‌ట్రా గుంజుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే వ్యాపారుల దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే ఎవరిని ప్రశ్నించాలని వాపోతున్నారు. వాస్తవంగా పెరిగిన ధరలు FEB-1 నుంచి అమల్లోకి రావాలి.
News January 2, 2026
మూసీ పరివాహకంలో నైట్ ఎకానమీ అభివృద్ధి: సీఎం

మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు మూసీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు CM అసెంబ్లీలో తెలిపారు. దీంట్లో నష్టపోయే స్థానికులకు బ్రహ్మాండమైన కాలనీ కట్టిస్తామన్నారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీని పెట్టుకున్నామని, DPR వచ్చేవరకు ప్రజెక్టు అంచనా చెప్పమని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. ప్రజెక్టు వద్దన్నోళ్లు అంబర్‌పేట్ శ్మాశానవాటిక వద్ద ఒకరాత్రి ఉండి దుర్భరస్థితిని చూడాలన్నారు.
News January 2, 2026
HYD: సమ్మర్‌లో కరెంట్ కష్టాలకు చెక్!

వేసవి కాలంలో ఉక్కపోతతో నగరంలో అధికంగా ఏసీలు, ఫ్యాన్లు వినియోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ కోతలూ ఉంటాయి. ఈ సారి కోతలకు చెక్ పెట్టాలని విద్యుత్‌శాఖ చూస్తోంది. మహానగర వ్యాప్తంగా 20 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేసవి కాలానికి ముందే వీటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


