News November 28, 2024
బడ్జెట్‌లో భారతీయులు ఈ దేశాలు చుట్టేయొచ్చు!
విదేశాలకు వెళ్లాలని ఉన్నా, అందుకు రూ. లక్షల వెచ్చించాల్సి ఉండటంతో చాలామంది ఆగిపోతుంటారు. అయితే, అందుబాటు బడ్జెట్‌లో భారత్ చుట్టుపక్కల ఉన్న 5 దేశాలను చక్కగా చూసి రావొచ్చు. అవి.. నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్. ఇవన్నీ వివిధ సంస్కృతులతో కూడినవే కాక చక్కటి ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తుంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఈ దేశాలకు టూర్ వేసేయొచ్చు.
Similar News
News November 28, 2024
బ్రష్ చేసిన వెంటనే తింటున్నారా?
చాలా మంది బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేస్తుంటారు. వెంటనే తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నోటిలోని Ph స్థాయి ఆల్కలైన్‌గా మారుతుంది. ఇది ఆహార పదార్థాలను కొంతసేపటి వరకు జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆహార పదార్థాల రుచిని నాలుక గుర్తించలేదు. టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని కెమికల్స్ నోటి రుచిని తాత్కాలికంగా మార్చివేస్తాయి. అందుకే బ్రష్ చేసిన 10-15 నిమిషాల తర్వాత తినడం ఉత్తమం.
News November 28, 2024
జైస్వాల్ 40కి పైగా సెంచరీలు చేస్తాడు: మ్యాక్సీ
భారత యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ టెస్టుల్లో 40కి పైగా సెంచరీలు చేస్తారని ఆస్ట్రేలియన్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా జట్టు అతడిని ఆపకుంటే ఈ సిరీస్ మరింత భయంకరంగా ఉంటుందన్నారు. భిన్న పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప సామర్థ్యాన్ని ఈ కుర్రాడు కలిగి ఉన్నాడని మ్యాక్సీ ప్రశంసించారు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన జైస్వాల్ 4 సెంచరీలు చేశారు. అన్నింట్లోనూ 150+ పరుగులు చేయడం గమనార్హం.
News November 28, 2024
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సంతోష్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ గాంధీ, మమతాతో సహా ఇండియా కూటమి నేతలు హాజరుకానున్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి మంత్రుల విషయమై క్లారిటీ వచ్చాక మంత్రివర్గం కొలువుదీరనుంది. JMMకు ఆరు, కాంగ్రెస్‌కు 4, రాష్ట్రీయ జనతా దళ్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.