News November 28, 2024

ఆ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు: తలసాని

image

TG: ఇథనాల్ ఫ్యాక్టరీతో <<14729304>>తమకు ఎలాంటి సంబంధం లేదని<<>> మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉన్నత పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

Similar News

News November 28, 2024

చంద్రబాబుపై కేసుల్లో కౌంటర్ వేయండి: హైకోర్టు

image

AP: 2014-19 మధ్య స్కామ్‌లు జరిగాయంటూ చంద్రబాబుపై నమోదైన కేసులు, ఛార్జిషీట్లను హైకోర్టు ముందు ఉంచాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న పిల్‌పై కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

News November 28, 2024

ఎల్లుండి 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు

image

TG: పలు కారణాలతో రుణ‌మాఫీ నిలిచిన 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు సంక్షేమంపై CM రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు.

News November 28, 2024

రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సోదరుడు?

image

AP: జనసేన నేత నాగబాబును రాజ్యసభకు పంపే ప్రయత్నాల్లో Dy.CM పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏ పెద్దలతో ఇదే విషయాన్ని ప్రస్తావించారని టాక్. కాగా లోక్‌సభ ఎన్నికల్లోనే అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా కూటమి సీట్ల పంపకాల్లో ఆ స్థానం BJPకి వెళ్లింది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపాలని పవన్ భావిస్తున్నారు.