News November 28, 2024

నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సంతోష్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ గాంధీ, మమతాతో సహా ఇండియా కూటమి నేతలు హాజరుకానున్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి మంత్రుల విషయమై క్లారిటీ వచ్చాక మంత్రివర్గం కొలువుదీరనుంది. JMMకు ఆరు, కాంగ్రెస్‌కు 4, రాష్ట్రీయ జనతా దళ్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Similar News

News January 7, 2026

వికారాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గోపాల్ నాయక్

image

వికారాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సభావత్ గోపాల్ నాయక్ నియమితులయ్యారు. బుధవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణకు, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోరాడుతానని స్పష్టం చేశారు.

News January 7, 2026

పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

image

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.

News January 7, 2026

తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in