News November 28, 2024
జైస్వాల్ 40కి పైగా సెంచరీలు చేస్తాడు: మ్యాక్సీ
భారత యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ టెస్టుల్లో 40కి పైగా సెంచరీలు చేస్తారని ఆస్ట్రేలియన్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా జట్టు అతడిని ఆపకుంటే ఈ సిరీస్ మరింత భయంకరంగా ఉంటుందన్నారు. భిన్న పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప సామర్థ్యాన్ని ఈ కుర్రాడు కలిగి ఉన్నాడని మ్యాక్సీ ప్రశంసించారు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన జైస్వాల్ 4 సెంచరీలు చేశారు. అన్నింట్లోనూ 150+ పరుగులు చేయడం గమనార్హం.
Similar News
News November 28, 2024
HYDలో తగ్గిన యాపిల్ ధరలు
గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో యాపిల్ ధరలు తగ్గాయి. 2023 డిసెంబర్లో మంచి నాణ్యత గల యాపిల్స్ ఒక్కోటి ₹35-₹40, సాధారణ రకం పండ్లు ఒక్కోటి ₹25కు లభించాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి హై క్వాలిటీ యాపిల్స్ ఒక్కోటి ₹18, రెగ్యులర్ క్వాలిటీ పండ్లు ఒక్కోటి ₹10కే దొరుకుతున్నాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పంటలు బాగా పెరగడం, HYD పండ్ల మార్కెట్లకు సరఫరా పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 28, 2024
వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి
TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News November 28, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!
యూజర్ల సౌలభ్యం కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.