News November 28, 2024
నేడు ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ఆమె నేడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా సోదరుడు రాహుల్ లోక్‌సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వయనాడ్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రియాంక చరిత్ర సృష్టించారు.
Similar News
News November 28, 2024
టీచర్ల సెలవులపై ఆంక్షలు.. ఎత్తేయాలని డిమాండ్
AP: ఓ స్కూల్ లేదా మండలంలోని మొత్తం స్టాఫ్‌లో గరిష్ఠంగా 7-10 శాతం మంది టీచర్లు మాత్రమే సెలవులు వాడుకోవాలని విద్యాశాఖ షరతులు విధించింది. దీనిపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మండిపడింది. టీచర్లు అత్యవసర, ఆరోగ్య కారణాలతో తమ సాధారణ సెలవులను వినియోగించుకోవడంపై ఆంక్షలు తగవని పేర్కొంది. లీవ్స్‌పై పరిమితిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
News November 28, 2024
మూడేళ్లలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా TG: న్యాబ్
TG: వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇందుకోసం త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’ను తయారు చేస్తామన్నారు. డ్రగ్స్ నివారణపై పలు వర్సిటీలు, కాలేజీల సిబ్బందికి అవగాహన కల్పించారు. మార్కెట్‌లోకి రోజుకో కొత్త రకం డ్రగ్ వస్తోందని, నిటాజిన్ అనే డ్రగ్ ఒక్క గ్రాము 40 కిలోల ఓపీఎంతో సమానమని పేర్కొన్నారు.
News November 28, 2024
ఘోరం: ప్రియురాలిని చంపి 50 ముక్కలు చేసి..
ఝార్ఖండ్‌కు చెందిన నరేశ్ చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తూ సొంతూరు వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో ఆమెను హత్య చేశాడు. పదునైన ఆయుధాలతో శరీరాన్ని 50 ముక్కలు చేసి అడవిలో పారేసి పరారయ్యాడు. ఓ కుక్క యువతి శరీర భాగంతో తిరగడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు చికెన్ షాపులో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.