News November 28, 2024
ALERT.. మూడు రోజులు అతి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Similar News
News November 28, 2024
ప్రభుత్వం అలా.. ప్రతిపక్షం ఇలా!
TG: ఏడాదిలో రైతుల కోసం రూ.54,280కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి గుర్తుగా మహబూబ్‌నగర్‌లో మూడో రోజులపాటు ‘రైతు పండుగ’ నిర్వహిస్తోంది. అయితే రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్ వంటివి కలిపి ఇంకా రూ.40,800 కోట్లు చెల్లించాల్సి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏం చేశారని ‘రైతు పండుగ’ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై మీ కామెంట్.
News November 28, 2024
6 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో NIA దాడులు
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో NIA నేడు 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా సోదాలు ఆరంభించింది. ఇందుకు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంది. విదేశీ సిండికేటుతో ఇక్కడి ముఠాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తోంది. బాలకార్మికులు, నిరుపేదలే టార్గెట్‌గా వ్యాపారం చేస్తున్నట్టు అనుమానిస్తోంది. ఏయే రాష్ట్రాల్లో దాడులు చేపట్టారో తెలియాల్సి ఉంది.
News November 28, 2024
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం: సీఎం
TG: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని CM రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారన్నారు.