News November 28, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!
యూజర్ల సౌలభ్యం కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.
Similar News
News November 28, 2024
సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం
AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
News November 28, 2024
నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్
వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్‌నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్‌షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్‌గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.
News November 28, 2024
BGTలో విరాట్ పరుగుల వరద పారిస్తారు: ద్రవిడ్
BGT సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంచనా వేశారు. ‘కష్టమైన పిచ్‌లపై కూడా కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడూ ఆయన బ్యాటింగ్ బాగుంది. BGT సిరీస్‌లో తొలిమ్యాచ్‌లోనే సెంచరీ చేయడం చాలా విశ్వాసాన్నిస్తుందనడంలో డౌట్ లేదు. సిరీస్‌లో భారీగా పరుగులు చేస్తారనుకుంటున్నాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నారు.