News November 28, 2024
HYDలో తగ్గిన యాపిల్ ధరలు
గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో యాపిల్ ధరలు తగ్గాయి. 2023 డిసెంబర్‌లో మంచి నాణ్యత గల యాపిల్స్ ఒక్కోటి ₹35-₹40, సాధారణ రకం పండ్లు ఒక్కోటి ₹25కు లభించాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి హై క్వాలిటీ యాపిల్స్ ఒక్కోటి ₹18, రెగ్యులర్ క్వాలిటీ పండ్లు ఒక్కోటి ₹10కే దొరుకుతున్నాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పంటలు బాగా పెరగడం, HYD పండ్ల మార్కెట్‌లకు సరఫరా పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News November 28, 2024
లొకేషన్ హిస్టరీ కావాలా? త్వరగా సేవ్ చేసుకోండి!
నిర్ణీత సమయం తర్వాత Google Mapsలోని హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించనున్నట్లు యూజర్లకు Google ఈ-మెయిళ్లు పంపుతోంది. చివరి 3 నెలల టైమ్‌లైన్ లొకేషన్‌ను తొలగించనున్నట్లు తెలిపింది. లొకేషన్ హిస్టరీ కావాలనుకున్న యూజర్లు తమ డివైజ్‌లలో మాన్యువల్‌గా/క్లౌడ్ నెట్‌వర్క్‌లో బ్యాకప్‌గా సేవ్ చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం గూగుల్ లొకేషన్ సర్వీసెస్‌లోకి వెళ్లి ఎక్స్‌పోర్ట్ యువర్ లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
News November 28, 2024
బీఆర్ఎస్‌వీ నాయకుల్ని తక్షణం విడుదల చేయాలి: కేటీఆర్
గురుకుల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్‌వీ నేతల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో మండిపడ్డారు. ‘ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? నిన్న అరెస్ట్ చేసిన మా విద్యార్థి నాయకుల జాడ నేటికీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా ? వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2024
‘బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్‌పై ‘ఐశ్వర్యరాయ్-ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్‌కి తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.