News November 28, 2024

నెల్లూరు: కానిస్టేబుల్ సూసైడ్.. UPDATE

image

వెంకటగిరికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవి(29) విజయవాడలోని ఇంటెలిజెన్స్ విభాగంలో APSPగా పనిచేస్తున్నారు. ఆయన యనమలకుదురులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భార్య గాయత్రితో గొడవపడడంతో ఆమె పక్కింటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె వచ్చి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు: రూ.200 కోట్ల రుణ ‘సహకారం’

image

సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా 2025-26 మార్చి కల్లా రూ.2,250 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, రూ.2,050 కోట్ల రుణాలను 37,039 మంది రైతులకు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద వరికి రూ.52 వేలు, మిర్చి రూ.1.50 లక్షలు, పసుపు రూ.1.15-1.25 లక్షలు, నిమ్మ రూ.75- 85 వేలు, అరటి రూ.1.10 లక్షలు, చేపలు, రొయ్యలు రూ.3.75 – 4.07 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మరో 2 నెలలు గడువుకి రూ.200 కోట్ల రుణాలకు అవకాశం ఉంది.

News January 13, 2026

20న నెల్లూరు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

image

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.

News January 13, 2026

నెల్లూరు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్, SP

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు.