News November 28, 2024
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేడు సత్యసాయి, 30న అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 28, 2024
అనంతపురంలో ఉరేసుకుని మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం మెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. రోహిత్ MBBS నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సొంత ఊరు ఉరవకొండ పట్టణమని స్నేహితులు తెలిపారు. కేసు నమోదు చేసి తలిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
News November 28, 2024
బూడిద వివాదం: జేసీ, ఆదిలకు సీఎం పిలుపు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ సీఎం చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 28, 2024
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలి: కలెక్టర్ చేతన్
శ్రీ సత్య సాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.