News November 28, 2024

ఉక్రెయిన్‌కు మరిన్ని US ఆయుధాలు

image

జనవరిలో తన పదవీ విరమణకు ముందే ఉక్రెయిన్‌ సైన్యాన్ని బలోపేతం చేయడానికి US అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు. రష్యాతో యుద్ధం చేస్తోన్న ఆ దేశానికి $725 మిలియన్ల విలువైన ఆయుధాలను పంపనున్నారు. ఇందులో యాంటీ ట్యాంక్ వెపన్స్, ల్యాండ్ మైన్స్, డ్రోన్స్, స్టింగర్ మిస్సైల్స్, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ కోసం అవసరమైన సామగ్రి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే US కాంగ్రెస్ ఆమోదం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 28, 2024

లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్

image

AP: విజయవాడ గన్నవరం రోడ్డులో నిలిపిఉన్న లారీ క్యాబిన్‌లో డ్రైవర్ కుమార్ గుండెపోటుతో కుప్పకూలాడు. చాలాసేపటిగా లారీ అక్కడే ఉంచడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు క్యాబిన్‌లో చూడగా డ్రైవర్ విలవిల్లాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని విజయవాడ GGHకు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

News November 28, 2024

MH ఓటింగ్ శాతంపై మాజీ CEC అనుమానం

image

మహారాష్ట్ర ఎన్నికలపై మాజీ CEC ఖురేషీ అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 20న సాయంత్రం 5 గంటలకు 55% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67% అయినట్లు అధికారులు ప్రకటించారని, ఇంత వ్యత్యాసమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్‌లో నమోదైన ఓట్ల వివరాలను PO ఫామ్ 17Cలో అదే రోజు వెల్లడిస్తారని, తర్వాత రోజుకు అది ఎలా మారుతుందో అర్థం కావట్లేదన్నారు. ఇలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరూ నమ్మబోరని చెప్పారు.

News November 28, 2024

రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!

image

ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.