News November 28, 2024
ఘోరం: ప్రియురాలిని చంపి 50 ముక్కలు చేసి..
ఝార్ఖండ్‌కు చెందిన నరేశ్ చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తూ సొంతూరు వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో ఆమెను హత్య చేశాడు. పదునైన ఆయుధాలతో శరీరాన్ని 50 ముక్కలు చేసి అడవిలో పారేసి పరారయ్యాడు. ఓ కుక్క యువతి శరీర భాగంతో తిరగడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు చికెన్ షాపులో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News November 28, 2024
లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్
AP: విజయవాడ గన్నవరం రోడ్డులో నిలిపిఉన్న లారీ క్యాబిన్‌లో డ్రైవర్ కుమార్ గుండెపోటుతో కుప్పకూలాడు. చాలాసేపటిగా లారీ అక్కడే ఉంచడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు క్యాబిన్‌లో చూడగా డ్రైవర్ విలవిల్లాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని విజయవాడ GGHకు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
News November 28, 2024
MH ఓటింగ్ శాతంపై మాజీ CEC అనుమానం
మహారాష్ట్ర ఎన్నికలపై మాజీ CEC ఖురేషీ అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 20న సాయంత్రం 5 గంటలకు 55% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67% అయినట్లు అధికారులు ప్రకటించారని, ఇంత వ్యత్యాసమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్‌లో నమోదైన ఓట్ల వివరాలను PO ఫామ్ 17Cలో అదే రోజు వెల్లడిస్తారని, తర్వాత రోజుకు అది ఎలా మారుతుందో అర్థం కావట్లేదన్నారు. ఇలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరూ నమ్మబోరని చెప్పారు.
News November 28, 2024
రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!
ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.