News November 28, 2024

తమిళనాడులో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి!

image

తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Similar News

News November 28, 2024

వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదు: సుప్రీంకోర్టు

image

వివాహేతర సంబంధాల్లో సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు రేప్‌కేసులు పెట్టే సంస్కృతి పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే కచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమని జస్టిస్‌లు BV నాగరత్న, కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. ముంబై ఖర్గార్ స్టేషన్లో ఓ వివాహితుడిపై ఏడేళ్ల క్రితం విడో పెట్టిన కేసును కొట్టేసింది.

News November 28, 2024

మేం కక్ష సాధింపులకు పాల్పడట్లేదు: మంత్రి డోలా

image

AP: గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పుచేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్ట నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని విమర్శించారు.

News November 28, 2024

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?

image

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్‌కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?