News November 28, 2024

పరవాడ: ఫార్మా ప్రమాదంలో మరో కార్మికుడి మృతి

image

పరవాడ ఠాగూర్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక కార్మికుడు గురువారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడు పిఠాపురానికి చెందిన సీహెచ్.వీరశేఖర్‌గా గుర్తించారు. మరో కార్మికుడు టీ.చిన్నకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐటీయూ పేర్కొన్నారు. ఫార్మా యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీఐటీయూ నేత గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Similar News

News September 15, 2025

పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.

News September 15, 2025

విశాఖలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ

image

విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్‌ చేశారు. ఎంవీపీ లా అండ్‌ ఆర్డర్‌ సీఐగా ప్రసాద్, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.

News September 15, 2025

విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

image

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.