News November 28, 2024
‘బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్‌పై ‘ఐశ్వర్యరాయ్-ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్‌కి తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.
Similar News
News November 28, 2024
6 నెలల్లో రూ.60 వేల కోట్ల అప్పు: గుడివాడ అమర్నాథ్
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మంగళవారం అప్పుల రోజుగా మారిపోయిందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.60 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. ‘తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ ఏమైంది? ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పరవాడ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News November 28, 2024
కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT
APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. స్టేజ్-2 ఫిజికల్ టెస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. డిసెంబర్ చివరి వారంలో PMT, PET టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
News November 28, 2024
ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: ఇటీవల గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనలు జరిగిన విద్యాసంస్థలను సందర్శించి, విచారించడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అటు ప్రిన్సిపాల్ లేదా వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. స్కూల్స్, వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్స్, అంగన్వాడీ సెంటర్లలో ఈ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఫుడ్ వడ్డిస్తారు.