News November 28, 2024
నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్
వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్‌నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్‌షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్‌గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.
Similar News
News November 28, 2024
ఎల్లుండి ప్రభుత్వ స్కూళ్ల బంద్
TG: ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 30న పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు SFI రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
News November 28, 2024
సెకీతో ఒప్పందంపై జగన్ స్పందన
AP: సెకీతో YCP హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలపై జగన్ స్పందించారు. ‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం తీపికబురు అందించింది. తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తామని సెకీ చెప్పింది. ISTS ఛార్జీలు లేకుండా రూ.2.49కి యూనిట్ విద్యుత్ ఇస్తామంది. రైతుల పట్ల ప్రభుత్వం చూపిన శ్రద్ధను అభినందించింది. AP చరిత్రలోనే అతి తక్కువ రేటుకు చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఇది. దీనిపై ఆరోపణలా?’ అని మండిపడ్డారు.
News November 28, 2024
చిన్మయ చర్యలు ఆయన వ్యక్తిగతం: బంగ్లా ఇస్కాన్
చిన్మయ కృష్ణదాస్‌కు తమకు సంబంధం లేదని బంగ్లా ఇస్కాన్ తాజాగా స్పష్టం చేసింది. క్రమశిక్షణా చర్యలకింద చాలాకాలం క్రితమే సంస్థ నుంచి తొలగించామని పేర్కొంది. దాస్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, వాటితో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఆయన మాటలకు, చర్యలకు తాము బాధ్యులం కాదని తెలిపింది. కాగా.. సనాతన జాగరణ్ మంచ్‌కు చిన్మయ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నారు.