News November 28, 2024

కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ఐపీఎస్‌ల సంఘం

image

సిరిసిల్ల కలెక్టర్, పోలీసులపై <<14720925>>KTR చేసిన ఆరోపణలను<<>> IPSల సంఘం ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారులపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆరోపణలు ఉన్నాయని, నిరాధార ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. అధికారుల గౌరవం కాపాడేందుకు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. SRCL కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని KTR ఆరోపించారు.

Similar News

News November 6, 2025

వ్యాధులపై అపోహలు.. వైద్యుల హెచ్చరిక!

image

సాధారణ వ్యాధులపై ఉన్న అపోహలను వైద్యులు తోసిపుచ్చారు. స్ట్రోక్ వృద్ధులకే కాకుండా హై BP ఉన్న యువతకూ రావచ్చని తెలిపారు. ‘గుండెపోటు ప్రతిసారీ తీవ్రమైన నొప్పిని కలిగించదు. ‘సైలెంట్ అటాక్స్’ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పని చేయవు. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిందే. కొన్ని లక్షణాలు తగ్గాయని మెడిసిన్స్ ఆపొద్దు’ అని వైద్యులు స్పష్టం చేశారు.

News November 6, 2025

ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

image

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.

News November 6, 2025

రికార్డులు బద్దలు.. బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బిహారీలు రికార్డులు బద్దలుకొట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇవాళ జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఏకంగా 64.66శాతం ఓటింగ్ నమోదైంది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 64.6శాతమే ఇప్పటివరకు అత్యధికం. గత ఎలక్షన్స్‌(2020)లో 57.29శాతం పోలింగ్ రికార్డవగా ఈసారి 7శాతానికి పైగా ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం.