News November 28, 2024
‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?
Similar News
News January 13, 2026
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి

AP: సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు అదనపు ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని వివరించారు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని కోరారు.
News January 13, 2026
పండుగ రోజే షట్తిల ఏకాదశి.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం

పుష్యమాస కృష్ణ పక్షంలో వచ్చే షట్తిల ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది. 2026లో ఇది సంక్రాంతి రోజున వచ్చింది. ‘షట్’ అంటే ఆరు. ‘తిల’ అంటే నువ్వులు. ఈ రోజున నువ్వులతో స్నానం, నలుగు, హోమం, తర్పణం, దానం, నువ్వులు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల విశేష ఫలితాలుంటాయి. భక్తితో ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల పితృదోషాలు తొలగి, సంతోషాలు, మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
News January 13, 2026
రిపబ్లిక్ డే.. దీపికకు ప్రెసిడెంట్ ఇన్విటేషన్

భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్, ఏపీకి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకలకు రావాలంటూ ఆమెకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆహ్వానం పంపారు. శ్రీసత్యసాయి జిల్లాలోని తంబాలహట్టికి వెళ్లిన అధికారులు దీపికకు ఇన్విటేషన్ అందజేశారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల అంధుల జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో దీపికపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.


