News November 28, 2024

డిసెంబర్ 1 నుంచి మరో హామీ అమలు: టీడీపీ

image

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ‘వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పింఛనుదారు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని పేర్కొంది.

Similar News

News November 28, 2024

భార్య గొడవపెట్టుకోవడం క్రూరత్వం కాదు.. విడాకులివ్వలేం: హైకోర్టు

image

దాంపత్యంలో గొడవలు సాధారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మనోవేదన చెందినా అకారణంగా భార్య పెట్టుకొనే గొడవ క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. దీని ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేయలేమని Dr భగీశ్ కుమార్ VS రింకీ కేసులో వెల్లడించింది. 2015లో ఒత్తిడితో పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచి ఆమె చేతిలో కష్టాలు, అవమానాలు, బ్లాక్‌మెయిలింగ్ ఎదుర్కొన్నానన్న భర్త ఆమెతో విడిపోవడానికి సరైన సాక్ష్యాలు చూపలేదంది.

News November 28, 2024

చిన్మయ్‌ను విడుదల చేయండి: షేక్ హ‌సీనా

image

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సాధువు చిన్మ‌య్ కృష్ణ‌దాస్ అరెస్టు అక్రమమని, వెంట‌నే ఆయ‌న్ను విడుద‌ల చేయాల‌ని ఆ దేశ Ex PM షేక్ హ‌సీనా డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లలో న్యాయ‌వాది మృతి చెందడాన్ని ఖండించారు. ఆల‌యాలు, మ‌సీదులపై దాడులు జరుగుతున్నా శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. మత స్వేచ్ఛ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

News November 28, 2024

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం శుభవార్త

image

TG: కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్కడ LHB, EMU కోచ్‌లు తయారీ చేసేందుకు వీలుంటుంది. కాగా కోచ్‌ల తయారీకి తగినట్లు సౌకర్యాలు అభివృద్ధి చేయాలని SCRకు ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో కొత్తగా దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.