News November 28, 2024

పార్ల‌మెంటుకు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ

image

నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఏడుగురు పార్ల‌మెంటుకు వెళ్లారు. 1951-52లో అల‌హాబాద్ నుంచి నెహ్రు *1967లో రాయ్‌బ‌రేలీ నుంచి ఇందిరా గాంధీ *1980లో అమేథీ నుంచి సంజ‌య్ గాంధీ *1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ *1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ *2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ *2024లో వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు.

Similar News

News November 28, 2024

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం శుభవార్త

image

TG: కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్కడ LHB, EMU కోచ్‌లు తయారీ చేసేందుకు వీలుంటుంది. కాగా కోచ్‌ల తయారీకి తగినట్లు సౌకర్యాలు అభివృద్ధి చేయాలని SCRకు ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో కొత్తగా దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.

News November 28, 2024

టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్స్ ఉండవు: ప్రభుత్వం

image

TG: టెన్త్ పరీక్షల మార్కుల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇంటర్నల్స్‌కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

News November 28, 2024

HIGH ALERT.. అతి భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు ఉదయానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. నవంబర్ 30న తుఫాన్ తీరం దాటనుంది.