News November 28, 2024
కేంద్రమంత్రి దృష్టికి విశాఖ ఉక్కు కార్మికుల సమస్య

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామిని న్యూఢిల్లీలో ఆయన కార్యాలయంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై మంత్రితో ఎంపీ చర్చించారు. ముఖ్యంగా ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్టిల్ ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేస్తున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు.
Similar News
News March 10, 2026
మధురవాడ: మహిళా దినోత్సవం వేడుకలు.. పురుషులకు వంట పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా భీమిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వాంబేకాలనీలో వినూత్నంగా పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. 9వ రోజు కార్యక్రమంగా జరిగిన ఈ పోటీలలో స్థానిక పురుషులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. కుటుంబ బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం, మహిళల పట్ల గౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
News March 10, 2026
కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్‌కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News March 10, 2026
విశాఖలో యువకుడి అనుమానాస్పద మృతి

విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్‌ఐ మన్మథరావు మంగళవారం తెలిపారు. కొబ్బరి తోట ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు బర్రె శివ ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని మెడపై గాయాలు ఉండడంతో హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


