News November 28, 2024
APలో రాజ్యాంగానికి తూట్లు: జగన్

APలో గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడితే, కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ వెనక్కు పడుతున్నాయని జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్‌తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్‌తో పాటు ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది’ అని మండిపడ్డారు.
Similar News
News July 7, 2025
జులై 7: చరిత్రలో ఈరోజు

1896: భారత్‌లో తొలిసారిగా బొంబాయిలో చలనచిత్ర ప్రదర్శన
1900: స్వాతంత్ర్య సమరయోధుడు కళా వెంకటరావు జననం
1915: సినీ నటుడు మిక్కిలినేని జననం
1929: పోప్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు
1930: ‘Sherlock Holmes’ రచయిత ఆర్థర్ కోనన్ మరణం
1959: రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జననం
1973: గాయకుడు కైలాశ్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జననం
*ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
News July 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 7, 2025
GILL: ప్రపంచంలో ఒకే ఒక్కడు

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీలతో రికార్డుల మోత మోగించారు. ఫస్ట్ క్లాస్ మ్యాచులో 400+, లిస్ట్ ఏ మ్యాచులో 200+, టీ20 మ్యాచులో 100+, వన్డేలో 200+, టెస్టులో 400+ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ప్రపంచంలో మరే ఆటగాడికి ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా రెండో టెస్టు మ్యాచులో గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.