News November 28, 2024
షమీకి బీసీసీఐ డెడ్‌లైన్!
BGT సిరీస్‌లోకి తీసుకునేందుకు మహ్మద్ షమీకి బీసీసీఐ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడుతున్న షమీకి ప్రతి స్పెల్ అనంతరం బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స అందిస్తోంది. ఆయన బరువెక్కువ ఉన్నారని, మరో 10రోజుల్లో తగినంత తగ్గి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడో టెస్టుకు షమీ అందుబాటులోకి రావొచ్చని అంచనా.
Similar News
News November 28, 2024
చైనాలో కీలక అధికారిపై జిన్‌పింగ్ వేటు
చైనా కేంద్ర మిలిటరీ కమిషన్(CMC) సభ్యుడైన మియావో హువా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అధ్యక్షుడు జిన్‌పింగ్ సస్పెండ్ చేశారు. CMC అనేది చైనాలో అత్యంత శక్తిమంతమైన సంస్థ కావడం గమనార్హం. ‘హువా క్రమశిక్షణ తప్పినట్లు ఆరోపణలున్నాయి. దర్యాప్తు జరుగుతున్నందున విధుల నుంచి తప్పించాం’ అని రక్షణ శాఖ ప్రతినిధి కియాన్ తెలిపారు. రక్షణ మంత్రి డాంగ్ జున్‌పైనా దర్యాప్తు జరుగుతోందన్న వార్తల్ని ఆయన ఖండించారు.
News November 28, 2024
IPL: జితేశ్ శర్మ హైక్ 5,400 శాతం..!
ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును టీమ్ ఇండియా ప్లేయర్ జితేశ్ శర్మ అందుకున్నారు. వేలంలో ఆయన తన పాత ధర కంటే 5,400% ఎక్కువ పలికారు. 2024లో ఆయన రూ.20 లక్షలకే పంజాబ్ తరఫున ఆడారు. ఈ వేలంలో ఏకంగా రూ.11 కోట్లతో తన పంట పండించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో శాలరీ హైక్ సాధించిన ప్లేయర్ మరొకరు లేరు. వికెట్ కీపింగ్ నైపుణ్యం, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా మంచి పేరుండటంతో RCB అతడిని కొనేసింది.
News November 28, 2024
కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.