News November 28, 2024
నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్

నెల్లూరు జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
Similar News
News January 17, 2026
కోడి పందాలపై కఠినంగా.. బీచ్ భద్రతపై ఎందుకీ నిర్లక్ష్యం?

కోడి పందాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినా, సముద్ర తీర ప్రాంతాల భద్రతపై మాత్రం అదే స్థాయి పర్యవేక్షణ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 2న మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకులు మృతి చెందగా, తాజాగా శుక్రవారం అల్లూరు బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. లైఫ్‌గార్డులు, హెచ్చరిక బోర్డులు, పోలీస్ పర్యవేక్షణ లోపించడం ప్రమాదాలకు కారణమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 17, 2026
నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.
News January 17, 2026
ముక్కనుమ విశిష్టత మీకు తెలుసా..?

ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు ‘సావిత్రి గౌరివత్రం’ అంటే ‘బొమ్మల నోము’ పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. తెలిసినవారు కామెంట్ చేయండి.


